మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. పండించిన రైతులు సంబురపడ్డారు. గత వారం కొత్త ఉల్లికి మార్కెట్లో కనిష్టంగా రూ.1800 నుంచి రూ.2300 కొనసాగాయి. ఇవాళ జరిగిన క్రయవిక్రయాల్లో వ్యాపారులు, వినియోగదారులు వేలంపాటలో పోటీ పడి కొనుగోలు చేశారు. కనిష్టంగా రూ.2400 నుంచి రూ. 3000 వరకు కొనసాగాయి. కొత్త ఉల్లికి సైతం పాత ఉల్లితో సమానంగా ధరలు రావడం వల్ల ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: నీళ్ల మంత్రిగా కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగా: మంత్రి హరీశ్