మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు గ్రామ వ్యవసాయ బావి వద్ద వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడం వల్ల వ్యవసాయ శాఖ అధికారులు నాసిరకం విత్తనాలు, అనుమతి లేని విత్తనాలపై విస్తృతంగా తనిఖీలు చేశారు.
ఏలూరు సమీపంలోని రెడ్యా తండా వద్ద వెంగల్ అనే వ్యక్తి వ్యవసాయ పొలం వద్ద గదిలో దాచిన రూ. 2 లక్షల విలువ చేసే నాసిరకం పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 279 నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్న వెంగల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్గా పరిగణిస్తారా?