ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా రాపిడ్ యాంటీజెన్ కిట్లు, కొవిడ్ టీకాల కొరత

author img

By

Published : Apr 28, 2021, 3:59 AM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాపిడ్ యాంటీజెన్, కొవిడ్ టీకాల కొరత వేధిస్తోంది. రెండూ అందుబాటులో లేక మంగళవారం చాలా చోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెలవెలబోయాయి. పరీక్షలు, టీకాల కోసం వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. ప్రస్తుతం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రాపిడ్ యాంటీజెన్ కిట్లు, జిల్లాకు పంపే టీకాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది.

మహబూబ్​నగర్​ జిల్లా వ్యాప్తంగా రాపిడ్ యాంటీజెన్ కిట్ల కొరత

రాపిడ్ యాంటిజెన్ కిట్లు, టీకాల కొరత పాలమూరు జిల్లాను ఇబ్బందులకు గురి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు జనంతో కిటకిటలాడిన కొన్ని టీకా కేంద్రాలు, పరీక్షా కేంద్రాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. నేడు లేదా రేపు పూర్తిస్థాయిలో టీకాలు రాకపోతే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీకా పంపిణీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడనుంది.

నాగర్‌కర్నూల్ జిల్లాలో 29 టీకా పంపిణీ కేంద్రాలుండగా.. కేవలం 4 కేంద్రాల్లో మాత్రమే మంగళవారం టీకా పంపిణీ చేశారు. అది కూడా కొవాగ్జిన్ రెండో డోసు తీసుకునే వారికి మాత్రమే టీకాలు వేశారు. ప్రస్తుతానికి 3 వేల డోసుల వరకూ కొవాగ్జిన్ అందుబాటులో ఉన్నా.. కేవలం రెండో డోసు వారికి ఇచ్చేందుకు మాత్రమే అందుబాటులో ఉంచారు. మిగిలిన అన్ని టీకా కేంద్రాలను మూసేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 36 చోట్ల టీకాలు పంపిణీ చేస్తుండగా.. పేరూరు, ఎదిర, గంగాపూర్, బాలనగర్, పాతపాలమూరు, కోయిల్ కొండ, దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 26 నాటికే టీకా నిల్వలు నిండుకున్నాయి. నారాయణపేట జిల్లాలో 14 కేంద్రాల్లో రోజూ 1,400 మందికి సగటున టీకాలు వేస్తుండగా.. నేటికి సరిపడ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం మొత్తం 13 కేంద్రాలకు.. అన్నిచోట్ల వాక్సినేషన్ నడుస్తుండగా రోజూ సగటున 2,500 మందికి టీకా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 45 వేల మందికి టీకా వేశారు. సుమారు 10 వేల డోసులు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

లక్ష్యానికి మించి అన్ని కేంద్రాల్లో రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరగ్గా.. ప్రస్తుతం కిట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా చోట్ల టెస్టులు నిర్వహించడం లేదు. కిట్ల లభ్యతను బట్టి పరీక్షలు చేస్తున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎప్పటికప్పుడు కిట్లు సరఫరా చేయకపోతే చాలా చోట్ల పరీక్షలు సైతం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.

పరీక్షలు, టీకాలు వేయించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరగుతున్న దృష్ట్యా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కొరత లేకుండా గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా..? ఆరోగ్యశాఖ తర్జన భర్జన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.