ETV Bharat / state

Congress Public Meeting in Jadcherla : 'రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు' - Congress Public Meeting in Jadcherla

Congress Public Meeting in Jadcherla : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ 800 కిలోమీటర్లు చేరుకున్న సందర్బంగా జడ్చర్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ సభ లో ఆరోపించారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.

Congress Public Meeting in Jadcherla
Congress Public Meeting in Jadcherla
author img

By

Published : May 25, 2023, 10:49 PM IST

Congress Public Meeting in Jadcherla : రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్​సింగ్‌ సుఖ్ హాజరయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కిీలక నేతలు పాల్గొన్నారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఎవరు అడ్డకున్నారు? : పాలమూరును అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చినా పాలమూరులో వలసలు ఆగలేదని ఆరోపించారు. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఎవరు అడ్డకున్నారని ప్రశ్నించారు. ఇక్కడ 10లక్షల ఎకరాలు ఎడారిగా మారిపోతున్నాయని అన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి జరిగిందని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ఇదే విషయంపై చర్చకు తాను సిద్ధమని అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తమదని పేర్కొన్నారు. అలాగే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వివరించారు. మరోవైపు 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని.. రూ.500లకే గ్యాస్‌ ఇస్తామని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు : రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ పంచిన అటవీ భూములను ముఖ్యమంత్రి గుంజుకున్నారని విమర్శించారు. పాదయాత్రలో పోడు భూముల పట్టాలను గిరిజనులు తనకు చూపించారని తెలిపారు. కుమ్మరి తండా మహిళలు తమ సమస్యలను తన వద్ద ప్రస్తావించారని వివరించారు. పాదయాత్రలో గిరిజనుల కష్టాలు చూశానని పేర్కొన్నారు. ధరణిలో భూముల వివరాలు కనిపించట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. నిరుద్యోగుల సమస్యలను పాదయాత్రలో విన్నానని భట్టి విక్రమార్క వెల్లడించారు.

"గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకు నీళ్లు, నిధులు వెళ్తాయి. కాళేశ్వరం, మల్లన్నసాగర్‌ ద్వారా నీళ్లు పారుతాయి. పాలమూరును అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చుక్క నీరు రాలేదు. దుర్మార్గాలకు కారణం కేసీఆర్‌ కాదా?. ఆంధ్ర పాలకుల హయాంలో పాలమూరుకు అన్యాయం. పాలమూరు వలసలు ఆగలేదు.. రైతుల చావులు ఆగలేదు. పాలమూరు అభివృద్ధిని కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు

ఇవీ చదవండి : Jeevan Reddy Fires on BRS Govt : 'రైస్‌మిల్లర్ల చెప్పుచేతుల్లో ధాన్యం సేకరణ'

కాళ్లు, చేయి లేకున్నా సివిల్స్​లో విజయం.. దివ్యాంగుల అద్భుత ప్రతిభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.