ETV Bharat / state

ఈదురు గాలులు బీభత్సం.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా - ఈదురు గాలులు బీభత్సం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో.. అప్పటివరకు ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురుగాలులు సృష్టించిన బీభత్సానికి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

dust storm
ఈదురు గాలులు
author img

By

Published : Apr 6, 2021, 6:41 AM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి సుమారు గంటకు పైగా వీచిన గాలులకు.. అంబేడ్కర్ నగర్​లో చెట్టు విరిగి రహదారిపై పడింది. కేసముద్రం వెళ్లే మార్గంలో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. బేతోలు, బాబు జగ్జీవన్ రాం నగర్ కాలనీలోని పలు ఇళ్లపై.. కప్పులు లేచిపోయాయి. గృహోపకరణాలు ధ్వంసం అయ్యాయి.

ఈదురు గాలుల వేగానికి పలుచోట్ల తీగలు తెగిపడి.. సుమారు 2 గంటల పాటు విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: బాలికను బెదిరించి ఏడాదిగా అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.