ETV Bharat / state

దీక్షిత్ కథ విషాదాంతం... కన్నీటి సంద్రంలో కుటుంబం - మహబూబాబాద్ బాలుడిని హత్య చేసిన కిడ్నాపర్​లు

మహబూబాబాద్​లో అపహరణకు గురైన బాలుడు దీక్షిత్​ రెడ్డి కథ విషాదంతో ముగిసింది. దీక్షిత్​ను కిడ్నాపర్లు చంపేశారు. దీంతో జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. బాలుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. దీక్షిత్​ నివాసం దుఃఖసాగరంలో మునిగిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు క్షేమంగా తిరిగివస్తాడని ఎదురుచూసిన ఆ తల్లికి శోకమే మిగిలింది. ఇక తన కుమారుడు రాడన్న చేదు నిజాన్ని తట్టుకోలేక గుండెపగిలేలా రోదిస్తోంది.

కిడ్నాపర్​లను ఎన్​కౌంటర్​ చేయాలి: స్థానికులు
author img

By

Published : Oct 22, 2020, 12:37 PM IST

బాలుడు దీక్షిత్‌ రెడ్డి హత్య ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. దీక్షిత్‌ రెడ్డిని చంపిన కిడ్నాపర్లను ఎన్‌కౌంటర్ చేయాలని స్థానికులు పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు. కిడ్నాపర్లకు సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని నినదించారు. బాలుడి ఇంటికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలతో దీక్షిత్‌ నివాసం దుఃఖసాగరంలో మునిగిపోయింది.

కిడ్నాపర్​లను ఎన్​కౌంటర్​ చేయాలి: స్థానికులు

ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో బాలుడు దీక్షిత్‌ ఇంటి వద్ద ఆడుకుంటుండగా దుండగులు అపహరించారు. రూ. 45 లక్షలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామంటూ కిడ్నాపర్లు ఫోన్‌లో బెదిరించారు. ఈ మేరకు బాలుడు దీక్షిత్‌ తండ్రి మహబూబాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడి ఆచూకీ కోసం 100 మందితో కూడిన 10 బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.

45 లక్షల్లో కొంత డబ్బు ఇచ్చేందుకు బాలుడి తల్లిదండ్రుల అంగీకరించారు. కిడ్నాపర్ చెప్పిన సమయానికి బాలుడి తల్లిదండ్రులు డబ్బు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ చోట వేచిచూసిన తల్లిదండ్రులు కిడ్నాపర్ నుంచి స్పందన రాకపోవడం వల్ల ఇంటికి వెళ్లిపోయారు. అంతలోనే ఈ దారుణం జరిగింది. దీక్షిత్‌ను దుండగులు హత్యచేశారు.

ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.