మహబూబాబాద్‌లో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. తెరాస రెండోసారి అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్నా ఏ ఒక్కరికి కూడా కొత్త పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తాం: కేటీఆర్