కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం రాస్పల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామంలోని పులాజి బాబా ధ్యాన కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాద సమయంలో ధ్యాన కేంద్రంలో ఎవరు లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. 50 వేల నగదుతో పాటు ఇతర సామాగ్రి కలిపి సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.
ఇవీ చూడండి: అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...