ETV Bharat / state

అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...

author img

By

Published : Oct 23, 2019, 8:46 AM IST

వేళకు పట్టెడన్నం పెట్టే అమ్మ లేదు. చేయిపట్టి నడిపించే నాన్న రాడు..  ఏడ్చీ ఏడ్చీ కళ్ల నుంచి రక్తాశ్రువులు రాలుతున్నాయి.. విధి వైపరీత్యమో.. వ్యవస్థ శాపమో ఓ రెండు ఊళ్లలోని వారికి జీవితకాలపు శోకం మిగిలింది. తల్లి లేని పిల్లలు.. తండ్రి లేని కుటుంబాలు.. అంతా అనాథలుగా మిగిలారు. దక్షతలేని లోకంలో.. రక్షణ లేని వ్యవస్థలో ఈ చిన్నారులు మనగలిగేదెలాగో!

అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...

దాదాపు రెండు నెలల కిందట ఓ లారీ.. ఆటోలోని 13 మందిని కబళించిన దుర్ఘటన తాలూకు విషాదమిది. ఒక్క ప్రమాదం.. రెండు ఊళ్లలో.. దాదాపు పది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

వ్యవస్థలోని లోపాలు ఆ కుటుంబాలకు శాపమయ్యాయి. రోజూ కూలికి వెళ్తే కానీ కడుపు నిండని బతుకులను రోడ్డుపాలు చేశాయి. ఓ ఆటో డ్రైవరు అత్యాశ.. నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోని ప్రభుత్వ శాఖలు.. తగినంతగా రవాణా సదుపాయాలు లేకపోవడం, రోడ్డు ప్రమాదాలను అరికట్టాల్సిన విభాగం నిర్లక్ష్యం.. ఇవన్నీ కలిసి రెండు గ్రామాల్లోని ఒక తరాన్ని అనాథగా మార్చేశాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం రెడ్డిగూడ కమాన్‌ మలుపు వద్ద గత ఆగస్టులో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదం తాలూకు గాయాలు కొత్తపల్లి, గోగ్యాతండా వాసుల గుండెలను పిండేస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో మృత్యువాతపడ్డారు. వారి పిల్లలు అనాథలయ్యారు.. వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమైంది.

జవాబు చెప్పేది ఎవరు?

కేవలం నలుగురు లేదా ఐదుగురు పట్టే ఆటో అది. అందులో ఏకంగా 18 మంది ఎక్కారు. ప్రజారవాణా వ్యవస్థ మెరుగ్గా ఉంటే వారిలాంటి సాహసానికి ఒడిగట్టేవారా? పరిమితికి మించి జనం ఆటోల్లో ప్రయాణిస్తున్నా గుర్తించని రవాణాశాఖ.. చలానాలకే పరిమితమైన పోలీసులు.. వీరంతా బాధ్యులు కారా? ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో నిత్యం ఎంతోమంది ఇలాగే ప్రయాణిస్తుంటారు. వారందరికీ ప్రాణాల మీద తీపి లేక కాదు.. కూలీ పనులలో.. ఇతర విధులకో సకాలంలో, తక్కువ ఖర్చుతో వెళ్లాలనే ఉద్దేశంతో తప్పనిసరై ఇలా రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనూష, సరిత, సంతోష్‌.

ఈ ముగ్గురికీ మన వ్యవస్థ ఏం సమాధానం చెబుతుంది? ఆటో ప్రమాదం వీరి తలరాతలను మార్చేసింది. అమ్మానాన్నలకు బదులు మరొకరిపై ఆధారపడేలా చేసింది. నాటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శివాజీ నాయక్‌, చాందీ బిడ్డలే ఈ అనూష, సరిత, సంతోష్‌. డీఈడీ పూర్తి చేసిన అనూష ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామన్న ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. నర్సింగ్‌ కోర్సులో చేరాల్సిన సరిత కూడా అంతే. వారిద్దరిపై సంతోష్‌ జీవితం ఆధారపడి ఉంది.

పరిష్కారం ఏమిటి.. బాధ్యులెవరు..

ప్రధాన రహదారుల్లోనే కాదు గ్రామీణ మార్గాల్లోనూ.. ఆటోల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను కుక్కేస్తున్నారు. గత ఏడాది కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో 63 మంది మృతి చెందారు. ఏదైనా దుర్ఘటన జరగ్గానే అధికారులు కొంత హడావిడి చేసి వదిలేస్తున్నారు. ప్రమాదాల నియంత్రణలో అధికారులను బాధ్యుల్ని చేయకపోవడంతో ఇవి పునరావృతమవుతూనే ఉన్నాయి.

నాయనమ్మ కోసం తమ్ముడి ఏడుపు
నాయనమ్మ కోసం తమ్ముడి ఏడుపు

45 శాతం ప్రమాదాలు ఇక్కడే

రోడ్డు ప్రమాదాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా రాష్ట్రంలో మొదటి పది స్థానాల్లో నిలుస్తోంది. ఈ జిల్లా మీదుగా వెళ్లే హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారి ప్రమాదాల్లో రెండో స్థానంలో ఉంది. 45 శాతం ప్రమాదాలు ఈ రోడ్డుపైనే జరుగుతుండగా పెద్దసంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి.

Washington, DC (USA), Oct 23 (ANI): Senior Indian journalist from Kashmir, Aarti Tikoo Singh said that the United States House Foreign Affairs Committee hearing was prejudice, biased and a setup against India and also in favour of Pakistan. she said, "The entire Congressional hearing was prejudice, biased and a setup against India and also in favour of Pakistan. The congressional hearing was completely prejudice against 15,000 Kashmiri Muslims civilians who have been killed by Pakistan, it was prejudice against 3 lakh Kashmiri pundits who were ethnically cleansed from Kashmir in 1990, it was prejudice against over 700 Kashmiri pundits who work here in Kashmir in 1990."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.