ప్రాణహిత నదీపరివాహాక ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పసిగట్టిన పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నెలరోజుల కిందట స్వయంగా ఆసిఫాబాద్ పర్యటనకు వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి... రెండురోజులు పోలీసుయంత్రాంగానికి దిశానిర్ధేశం చేసివెళ్లారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఆసిఫాబాద్ చేరుకున్న డీజీపీ మహేందర్‌రెడ్డి... ఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.
రామగుండం సీపీ సత్యనారాయణతో కలిసి... ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్‌తో కలిసి... హెలిక్యాప్టర్‌లో తిరిగి ఆసిఫాబాద్ చేరుకున్నారు. మావోయిస్టు అ్రగనేత గణపతి లొంగిపోతారనే ఊహగానాల మధ్య డీజీపీ.... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యాంశంగా మారింది.
ఇదీ చూడండి : ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా