ETV Bharat / state

మంత్రి పువ్వాడ, ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ దీక్ష - మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం జిల్లాలో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విపక్ష ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించారని జిల్లా కాంగ్రెస్ కమిటీ మండిపడింది. ఈ మేరకు డీసీసీ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్ష నిర్వహించింది.

మంత్రి పువ్వాడ, ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ దీక్ష

author img

By

Published : Aug 6, 2020, 10:02 PM IST

ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విపక్ష ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ డీసీసీ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచిన కార్పొరేటర్లను, సర్పంచ్‌లను ఖమ్మం జిల్లాలో పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవి పాటించాలి...

ప్రజాస్వామ్యంలో విలువలు పాటించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు హితవు పలికారు. అవమానకరంగా మాట్లాడటం.. అధికారులు ప్రోటోకాల్‌ పాటించకపోవడం సరైన పద్దతి కాదన్నారు. అధికారంలో ఎవరైనా ఉండవచ్చని... కానీ అధికారులు ఎప్పుడు ఉంటారని గుర్తు చేశారు. తమ హక్కుల సాధనకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : మనోనిబ్బరంతోనే కొవిడ్‌ను జయించగలం: అంజనీకుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.