ఖమ్మం జిల్లాలోని 16వ డివిజన్ కార్పోరేటర్ కమర్తపు మురళి ప్రజల రోగ నిరోధక శక్తి పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తన డివిజన్లో ఉచిత కషాయం కేంద్రాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేత ప్రారంభింపజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పినట్టు దాల్చిన చెక్క, మిరియాలు, దాల్చినచెక్క, పసుపు, శొంఠి, లవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలన్ని కలిపి కషాయాన్ని తయారు చేస్తున్నట్టు కార్పోరేటర్ తెలిపారు.
సొంతంగా ఇంట్లో కషాయం తయారు చేసుకోలేని వారు, పేదలకు డివిజన్లోని తెరాస పార్టీ కార్యాలయంలో ఉచితంగా కషాయం అందజేస్తున్నామన్నారు. ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగితే.. కరోనా ఏమీ చేయలేదని, ప్రతీ ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, పానీయాలు తీసుకోవాలని కార్పోరేటర్ సూచించారు.