Flood Effect on Khammam District : శాంతించిన మున్నేరు.. ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు - telangana latest news
Flood Effect on Khammam District Rains 2023 : ఖమ్మం వద్ద ఉగ్రరూపం దాల్చిన మున్నేరు నది.. పరివాహక ప్రాంతాల ప్రజలకు కన్నీరు మిగిల్చింది. వరద ప్రభావంతో ప్రజలు ఇప్పటికీ విలవిలలాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడిన వరదకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఇప్పుడు వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో.. ప్రజలు తిరిగి ఇంటికి చేరారు. పూర్తిగా రూపురేఖలు మారిన ఇళ్లను చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Flood Effect on Khammam District 2023 : గత నెల 27, 28 తేదీల్లో మున్నేరు ఉగ్రరూపంతో ఖమ్మంలోని పలు కాలనీలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. 27వ తేదీ తెల్లవారుజామున ఒక్కసారిగా వరద వచ్చి.. కాలనీలను ముంచెత్తింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ... ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోఉన్న పద్మావతి నగర్, వెంకటేశ్వరకాలనీ, బొక్కల గడ్డ, మోతీనగర్, సారథినగర్, రంగనాయకుల గుట్ట, ప్రకాశ్ నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతాల్లో నివాసాలు మునిగి పోయాయి. ఎన్నడూ లేనంతగా సుమారు 31 అడుగుల మేర వరద ప్రవహించింది.
Khammam Floods 2023 : మున్నేరు శాంతించి వరద తగ్గుముఖం పట్టడంతో తిరిగి తమ ఇళ్లకు చేరుకున్న స్థానికులు జరిగిన నష్టాన్నిచూసి కన్నీరుమున్నీరవుతున్నారు. పలు కాలనీల్లో నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొన్ని గృహాలు ఆనవాళ్లు కోల్పోయాయి. సుమారు 17వందల నివాసాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 70 ఇళ్ల వరకు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరదతో పాటు చెత్త.. బురద భారీగా మేట వేసింది.
'' రాత్రి పడుకునే సమయంలో చాలా వరదలు వచ్చాయి. వెంటనే ఏ సామన్లు లేకుండా ఊర్లో నుంచి వెళ్లిపోయాం. అధికారులు ముందు సమాచారం ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే విలువైన సామాన్లు అన్నీ తీసుకొని వెళ్లే వాళ్లం. ఎంతో కష్టపడి వాయిదాల పద్ధతిలో కొనుకున్న రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, బంగారం కూడా నీటిలో కొట్టుకుపోయాయి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. - బాధితులు
- Telangana projects Rains : భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. వరదతో ప్రాజెక్టులకు జలకళ
- Third Danger Alert at Godavari : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీ
Khammam Floods Latest News : అందరూ దిగువ మధ్యతరగతి.. పేదలు నివాసాలు ఉండే ప్రాంతాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నారు. ఎంతో కష్టపడి వాయిదాల పద్ధతిలో కొనుకున్న రిఫ్రిజిరేటర్లు. ఫ్రీజ్‌లు, కూలర్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు, మంచాలు, బంగారం కూడా నీటిలో కొట్టుకుపోయాయి. ఎవరిని పలకిరించిన తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కదిలిస్తే కన్నీటి పర్యంతం అవుతున్నారు.
''మున్నేరులో 700 ఇండ్లు వరద ప్రభావానికి గురయ్యాయి. కొన్ని ఇండ్లు కూలిపోయాయి. ఈ ఇండ్లన్నీ వరద ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్లు ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. అమాయకులు కాస్త తక్కువ రేటుకు వస్తోంది కదా అని.. వరద ప్రాంతాలు అని తెలియక కొంటున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఇక్కడ ఇండ్ల నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.'' - వి.పి.గౌతమ్, ఖమ్మం జిల్లా కలెక్టర్
అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు. ముందే చెబితే విలువైన వస్తువులు కాపాడుకునే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమికంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. కొందరు స్థిరాస్తి వ్యాపారులు చెరువు పరివాహకంలో నిర్మించిన ఇళ్లు ధ్వంసమయ్యాయని భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా ముంపు సరిహద్దులు నిర్ణయిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి.