ETV Bharat / state

గంగాదేవి ఆలయ ప్రాంగణంలో గంగపుత్రుల హరితహారం

పర్యావరణ సమతుల్యానికి మొక్కలు నాటి తమ వంతు తోడ్పాటును అందిస్తామని కరీంనగర్​ జిల్లా గంగపుత్ర సంఘం పేర్కొంది. సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్​ బెస్త ఆధ్వర్యంలో సభ్యులు దిగువ మానేరు డ్యాం సమీపంలోని శ్రీ గంగామాత ఆలయం వద్ద మొక్కలు నాటి హరిహారం కార్యక్రమం నిర్వహించారు.

haritha haram program by the gangaputra union in karimnagar district
గంగాదేవి ఆలయ ప్రాంగణంలో గంగపుత్రుల హరితహారం
author img

By

Published : Aug 2, 2020, 4:42 PM IST

కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యాం సమీపంలో శ్రీ గంగా మాత ఆలయం వద్ద గంగపుత్ర సంఘం హరిత హారం కార్యక్రమం నిర్వహించింది. గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ శివకుమార్ బెస్త ఆధ్వర్యంలో సభ్యులు మొక్కలు నాటారు. ఆలయం ప్రాంగణంలో ఆథ్యాత్మిక పరమైన జమ్మి చెట్టు, రావి చెట్టు, మారేడు చెట్టు సహా పండ్ల చెట్లును నాటామని శివకుమార్ వెల్లడించారు.

నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించడానికి గుడి ఆవరణలో ఇలా హరితహారం కార్యక్రమం చేపట్టామని తెలిపారు. జిల్లాలోని మిగతా గంగపుత్ర సంఘాలు, ఇతర కుల సంఘాలు మొక్కలు నాటాలని కోరారు. భవిష్యత్​లోనూ మరిన్ని చెట్లు నాటి పర్యావరణ సంరక్షణకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని వివరించారు.

ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.