ETV Bharat / state

'అండగా ఉంటారనుకుంటే ఊరి నుంచి పొమ్మన్నారు' - MOTHER AND CHILD latest News

స్వగ్రామంలోకి వెళ్తే తల్లీ, కూమారుడ్ని ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకున్న ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో చోటు చేసుకుంది. తమకు ప్రభుత్వమే గూడు కల్పించాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

'అండగా ఉంటారనుకుంటే ఊరి నుంచి పొమ్మన్నారు'

author img

By

Published : Jul 3, 2020, 10:26 PM IST

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన తల్లీ, కుమారుడ్ని ఊర్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. తమకు కరోనా లేదని స్పష్టం చేసినా వినలేదని బాధితులు వీడియో తీసి తన ఆవేదన వెళ్లిబుచ్చుకున్నారు. ఆ తల్లి అదే స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకంలో వంట చేసేవారు. ఇప్పుడు ఒక పూట కూడా మంచినీరు ఇచ్చేవారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రభుత్వమే తమకు దారి చూపాలి..

తమ బంధువులకు కరోనా వచ్చింది కానీ తమకు ఏ వైరస్ సోకలేదన్నారు. ఆపదలో సొంత ఊరు అండగా ఉంటారనుకుంటే వారే ఊరికి రావద్దంటున్నారని విలపించారు. గ్రామస్థుల సూటి పోటీ మాటలు విని మనోవేదనకు గురయ్యామని కన్నీరుమున్నీరయ్యామని స్పష్టం చేశారు.

తాము ఉంటున్నది అద్దె ఇల్లైనా.. అందులోనే ఉండి బయటకు రాకుండా ఉంటామన్నా వినలేదని వాపోయారు. ఇలా గ్రామ బహిష్కరణ చేస్తే ఎక్కడికి పోవాలో అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పొలిమేరలో ఓ పాఠశాలలో గది ఇచ్చారన్నారు. అందులో కనీస సౌకర్యాలు నీరు కూడా లేదన్నారు. ప్రభుత్వమే తమకు గూడు చూపించాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి : 'అక్టోబర్​లోగా కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తిచేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.