ETV Bharat / state

BRS Election Plan in Kamareddy 2023 : కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రచార జోరు.. 100 మంది ఓటర్లకో ఇంఛార్జ్​తో పక్కా ప్లాన్​​ - బీఆర్​ఎస్​ ఎన్నికల వ్యూహం 2023

BRS Election Plan in Kamareddy 2023 : అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్​ఎస్​ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయం కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వంద ఓటర్లకో ఇంఛార్జి, పోలింగ్ కేంద్రానికి ఓ బాధ్యుడిని నియమించే ప్రక్రియను సీనియర్ నేతలు చేపట్టారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు ముజీబోద్దిన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.. గెలుపు ప్రణాళికపై దృష్టి పెట్టారు. భారీ మెజార్టీ లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Telangana Assembly Elections 2023
CM KCR Election Campaign in Kamareddy
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 11:45 AM IST

BRS Election Plan in Kamareddy 2023 : కేసీఆర్‌ పోటీ చేస్తుండటంతో కామారెడ్డి నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్‌ పోటీ నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ రావడంతో స్థానిక నాయకత్వం గెలుపు ప్రణాళికల్లో నిమగ్నమైంది. ఇటీవల కేటీఆర్‌(KTR) కామారెడ్డిలో సభ నిర్వహించి క్యాడర్​కు దిశానిర్దేశం చేశారు. దేశంలోనే అత్యధిక మెజార్జీతో గెలిపించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి స్థానిక నేతలతో కలిసి ప్రచార, గెలుపు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.

KTR On BRS Campaign In Kamareddy Constituency : ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ 266 పోలింగ్ కేంద్రాల బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో కొన్ని పోలింగ్ కేంద్రాలకు కన్వీనర్​తో పాటు సహాయ కన్వీనర్​ను నియమించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన సొంత గ్రామమైన బస్వాపూర్లోని ఓ పోలింగ్ కేంద్రం బాధ్యతలను తీసుకున్నారు. బీఆర్​ఎస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్, సీనియర్ నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, మాచా రెడ్డి ఎంపీపీ నర్సింగరావులు బాధ్యతలను తీసుకున్నారు. కన్వీనర్లుగా నియమితులైన నేతలు గ్రామాలకు వెళ్లి వంద ఓటర్లకో ఇంఛార్జ్​ నియమించనున్నారు. ఇలా ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో పది మంది క్రియాశీల కార్యకర్తలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

BRS Election Campaign In Kamareddy Constituency : కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిర్వహణతో పాటు కార్యకర్తల పనితీరుపై పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సమాచారం. కామారెడ్డి పట్టణంలో జరిగిన పోలింగ్ కేంద్రాల కన్వీనర్ల నియామక ప్రక్రియలో భాగస్వాములైన కార్యకర్తలకు, నేతలకు పలు సూచనలు చేయడంతో ప్రచార వ్యూహాలను సుభాష్‌రెడ్డి నిర్దేశించారు. ఎన్నికలు ముగిసేంత వరకు సుభాష్‌రెడ్డి నియోజకవర్గ కేంద్రంలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల నిర్వహణతో పాటు ప్రతి పక్షాల ప్రచారాలను దీటుగా ఎదుర్కొనే నిమిత్తం నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేకంగా వార్‌ రూమ్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్‌(KCR) పోటీ నేపథ్యంలో నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫెస్టోను తయారు చేస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల నిర్వహించిన సభలో ప్రకటించారు. దీంతో మేధావులు, విశ్రాంత అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడి సమస్యలను అధ్యయనం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

BRS Incharges For 54 Constituencies : పదేళ్ల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.. 54 నియోజకవర్గాల ఇంఛార్జీలకు కేటీఆర్ దిశానిర్దేశం

BRS Manifesto 2023 Release Date : ఈ నెల 15న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. నవంబర్‌ 9న కేసీఆర్ నామినేషన్లు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.