కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని గండిమసాని పేట గేట్ వద్ద రోడ్డు భద్రత నియమాలపై డీఎస్పీ శశాంక్ రెడ్డి, సీఐ రాజశేఖర్ అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకోవద్దని సూచించారు. 2019 సంవత్సరంలో జిల్లాలో 227 మంది కేవలం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారన్నారు.
జనవరి నెలలో ఇప్పటివరకు సుమారు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి.. ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం జీవదాన్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు వాహనాలు నడపొద్దుని విద్యార్థులకు తెలిపారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్