జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో భూపాలపల్లి-హన్మకొండ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఓ లారీ రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి తీగలు రహదారిపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిచిలిపోయింది.
ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ రహదారి కావడం వల్ల కిలోమీటరు పొడవున వాహనాలు బారులు తీరాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి స్తంభాన్ని పక్కకు తీయించారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'