నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచిపోయారని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు దేవుడి పేరు చెప్పి మసిపూసి మారేడుకాయ చేశారని పొన్నాల మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు... రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు.