జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపులను ఇంజినీరింగ్ అధికారులు తాత్కాలికంగా నిలిపారు. ఉదయం వరకు 2 పంపులు పనిచేయగా... తర్వాత అన్నింటినీ ఆపేశారు. ఇప్పటి వరకు పంపులను మాన్యువల్‌గా నడపగా... ఇక నుంచి ఆటోమేషన్ పద్ధతిలో రన్ చేసేందుకు నిలిపివేసినట్లు చెబుతున్నారు. ఎగువ నుంచి వరద కూడా లేకపోవడం మరో కారణమని వివరించారు.
ఈ నెల 6నుంచి 10 పైపుల ద్వారా గ్రావిటీ కాలువలోకి నీటి ఎత్తిపోతల ప్రక్రియ జరిగింది. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 7.04 టీఎంసీలు, కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 4.50 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అన్నారం బ్యారేజి వద్ద 5.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రవాహం ఎక్కువ, తక్కువైనప్పుడు గేట్లు మూసివేయడం, ఎత్తడం కోసం లోడ్ టెస్టింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ 7.256 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చూడండి: "వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి"