ETV Bharat / international

ఇస్కాన్‌పై నిషేధానికి బంగ్లా హైకోర్టు నో- ఆ దేశంపై ఆంక్షలకు హిందూ సంఘాల డిమాండ్ - ISKCON BANGLADESH NEWS

ఇస్కాన్‌పై నిషేధానికి నిరాకరించిన బంగ్లాదేశ్‌ హైకోర్టు - ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు

ISKCON In Bangladesh
ISKCON In Bangladesh (ETV Bharat, Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2024, 5:07 PM IST

ISKCON In Bangladesh : ఇస్కాన్‌పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్‌ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఇస్కాన్‌ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. చిన్మయ్ కృష్ణదాస్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్లలో న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ మృతి చెందారు. దీంతో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలని ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది మోనిర్ ఉద్దిన్ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చిన్మయ్ కృష్ణదాస్‌ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్ల అంశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుందని అటార్నీ జనరల్ జస్టిస్ ఫర్హా మహబూబ్‌, జస్టిస్ దెబాసిస్‌ రాయ్‌ చౌధురీ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్య కేసులో, ఇస్కాన్ కార్యకలాపాలపై వేర్వేరు కేసులను నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 33 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న బంగ్లాదేశ్ హైకోర్టు ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించడానికి నిరాకరించింది.

'బంగ్లాదేశ్​పై ఆంక్షలు విధించాలి'
అటు బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులను అమెరికాలోని హిందూ సంఘాలు ఖండించాయి. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి. మైనార్టీలపై దాడుల విషయంలో ప్రపంచ మీడియా మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డాయి. కృష్ణదాస్ అరెస్టు, హిందూ ఆలయాలపై దాడులు బంగ్లాదేశ్‌లో మతపరమైన విద్వేషాల పెరుగుదలను సూచిస్తున్నాయని విశ్వహిందూ పరిషత్ అమెరికా శాఖ (VHPA) అధ్యక్షుడు అజయ్ షా అన్నారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటే దుండగులు మరింత రెచ్చిపోతారని వీహెచ్​పీఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ వ్యాఖ్యానించారు.

నిధులు నిలిపివేయాలని ట్రంప్​నకు లేఖ
బంగ్లాదేశ్‌లో అమెరికా నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులకు నిధులు నిలిపివేయాలని హిందూస్‌ ఫర్‌ అమెరికా ఫస్ట్ అనే సంస్థ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు లేఖ రాసింది. మైనార్టీలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వాలకు పన్ను చెల్లింపుదారుల సొమ్ము చేరకుండా చూడాలని కోరింది. మైనార్టీల రక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. కొంతమంది బంగ్లాదేశ్ అధికారులకు అతివాద గ్రూపులతో సంబంధాలున్నాయని ఆరోపించింది. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ ఎగుమతులపైనే అధారపడి ఉందని వాటిపై అధిక సుంకాలు విధించాలని కోరింది.

బంగ్లాదేశ్​ పరిస్థితులపై మోదీతో భేటీ
కృష్ణదాస్ అరెస్టు, మైనార్టీలపై దాడుల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పొరుగు దేశంలోని పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో పాటు పొరుగుదేశాలతో భారత్‌ సంబంధాలపై జైశంకర్‌ శుక్రవారం పార్లమెంట్‌లో వివరించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది.

కోల్​కతాలో నిరసనలు
హిందూ లీడర్‌ చిన్మయ కృష్ణదాస్‌ అరెస్టుకు నిరసనగా కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.