ETV Bharat / state

YUVA : ఐటీ ఉద్యోగం చేస్తూనే సోషల్ సర్వీస్ - 'వీటీవీవో'తో 15 రకాల సేవలు - VTVO HELPING PROGRAMS

సాఫ్ట్​వేర్​ రంగంలో ఉంటూనే సామాజిక సేవ - వీటీవీవో అనే సంస్థ ద్వారా పలు సేవకార్యక్రమాలు చేపట్టిన ఐటీ ఉద్యోగి

V The Volunteer Organization Running Many Service Programs
V The Volunteer Organization Running Many Service Programs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2024, 5:21 PM IST

V The Volunteer Organization Running Many Service Programs : ఉరుకుల పరుగల జీవితంలో సమయమంతా ఉద్యోగానికి సరిపోతుందనేది అపోహ మాత్రమే. ఎందుకంటే, చాలామంది యువత కొలువులు చేసుకుంటూనే సమాజానికి సేవచేసే కార్యక్రమాల్లో మమేకం అవుతున్నారు. ఆ యువకుడు సైతం అదే పనిలో పడ్డాడు. ఐటీ కొలువు చేస్తున్నా అందులో కావాల్సినంత ఆత్మసంతృప్తి దొరకలేదు. దీంతో వీటీవీవో అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. మరి, ఆ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌మెన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి.

వేలాది మంది యువతను భాగం చేసుకుని : సేవ చేయాలనే ఆలోచన ఉండాలే కానీ చేసేందుకు మార్గాలు అనేకం. అందులో భాగంగానే ఈ యువకుడు 15 రకాల సేవ కార్యక్రమాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. 'ద వాలంటీర్స్‌' అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తానొక్కడే కాకుండా వేలాది మంది యువతను అందులో భాగస్వామ్యం చేస్తున్నాడు.

ఈ యువకుడి పేరు సురేంద్రన్ మురుగానంద కృష్ణన్. తమిళనాడులో పుట్టి, కర్ణాటకలో పెరిగాడు. ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తోటివారికి సాయపడే తపన ఈ యువకుడిది. అలా సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలు పెట్టాడు. అయితే, ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేయాలంటే ఓ సంస్థను ఏర్పాటు చేస్తే బాగుందని వీటీవీవో ద వాలంటీర్‌ పేరుతో సేవా సంస్థను ప్రారంభించాడు.

రెండేళ్లలో 2500 యూనిట్ల రక్తం సేకరణ : వీటీవీవో స్థాపించిన వెంటనే సేవా కార్యక్రమాలు చేయడంలో నిమగ్నమయ్యాడు సురేంద్రన్‌. దాతల నుంచి రక్తం, ప్లేట్‌లెట్‌లు సేకరించడం, మూగజీవాలను సంరక్షించడం, చిన్నపిల్లలకు, వృద్ధులకు సేవలందించం వంటి 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ రెండేళ్లలో 2500 యూనిట్ల రక్తం సేకరించాడు. సురేంద్రన్‌ చేస్తున్న కార్యక్రమాలు పలువురికి నచ్చడంతో ఇతనితో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చారు.

సేవా కార్యక్రమం చేయడానికి కొన్ని నెలల ముందే సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తాడు సురేంద్రన్‌. యువతను భాగస్వామ్యం చేసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాడు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈ కార్యక్రమాల్లో స్థానికులతో పాటు వందలాది వీటీవీవో వాలంటీర్లు భాగస్వామ్యం అవుతున్నట్లు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో పెద్దల జాతర : సేవాకార్యక్రమాల్లో భాగంగా వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు వినోదం పంచే కార్యక్రామాలకు శ్రీకారం చూట్టాడీ సామాజిక సేవా కార్యకర్త. అందులో భాగంగానే హైదరాబాద్‌లో పెద్దల జాతర నిర్వహించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమం జరిగడం ఇదే తొలిసారి. సిటీలోని 20 వృద్ధాశ్రమాల నుంచి దాదాపుగా 300 మంది వృద్ధులను ఒకచోట చేర్చాడు. వారికి ఆట పాట వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రవృద్ధులతే ప్రశంసలు అందుకున్నాడు.

"మేము ఉద్యోగాలు చేసుకుంటూ సేవా కార్యాక్రమాలు చేస్తున్నాం. వీకెండ్స్‌ అంతా వద్ధాశ్రమాలకు వెళ్లి సమయం గడుపుతాం. అక్కడ వారికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇలా చేస్తుంటే వారితో పాటు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారు బాధలను మర్చిపోతారు. ఈసారి హైదరాబాద్‌లో వృద్ధుల కోసం పెద్దల జాతర నిర్వహించాం. చాలా మంది వచ్చారు. ఆనందంగా గడిపారు." - సురేంద్రన్, వీటీవీవో వ్యవస్థాపకులు

సేవా కార్యక్రమాలు చేయడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని వీటీవీవో సంస్థ వాలంటీర్లు అంటున్నారు. ఉద్యోగాలు చేస్తూనే వారాంతాల్లోనే పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.

సొంతంగా డబ్బులు సమకూర్చి : వాలంటీర్‌ సంస్థ చేసే కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఫండ్ రైజింగ్ చేయడమంటూ ఏమీ లేదు. సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా వాలంటీర్‌గా చేసేవాళ్లే సొంతంగా డబ్బులు సమకూర్చుతున్నారు. అలా వచ్చిన డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డబ్బులు సరిపోని తరుణంలో విభిన్న మార్గాలతో కార్యక్రమం నిర్వహించేలా సురేంద్రన్ కార్యచరణ రూపొందిస్తున్నారు.

సేవ చేయాడనికి ప్రత్యేక సమయమంటూ ఉండదని సుదర్శన్‌ అంటున్నాడు. నిత్యం మన కంటికి కనిపించే ప్రతి జీవిని ఏదో ఒక అవసరం వెంటాడుతూనే ఉంటుంది. అది గుర్తించి తమ వంతుగా స్పందిండాన్నే సేవా భావించొచ్చని అంటున్నాడీ సాఫ్ట్‌వేర్‌ సామాజిక కార్యకర్త.

ముప్పై ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తున్న నలుగురు అక్కాచెల్లెల్లు - భర్తలకు కూడా తెలియకుండా - Women Helps To Poor People

పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్​జెండర్​- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.