ETV Bharat / state

'పెండింగ్​లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి' - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. పెండింగ్​లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

mla gandra venkataramanareddy participated in mandal body meeting in jayashankar bhupalpally district
'పెండింగ్​లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి'
author img

By

Published : Jun 12, 2020, 8:55 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, రుణ మాఫీలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

అదే విధంగా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పంట మార్పిడి పద్ధతి ద్వారా కలిగే మార్పులు, లాభాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు ధాన్యం, మెుక్కజొన్న పంటలే కాకుండా ప్రత్యామ్నాయంగా మిర్చి, మినప, పెసర, ఇంకా ఇతర పంటలు కూడా పండించాలని సూచించారు. 98 వేల రూపాయల విలువ గల ఆరు సీఎం సహాయనిధి చెక్కులను అర్హులకు గండ్ర వెంకటరమణారెడ్డి అందజేశారు.

ఇవీ చూడండి: 'ఆ జిల్లా మంత్రిగా ఎంతో గర్వపడుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.