భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సదుపాయం ఉన్న కొవిడ్ ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణతో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రారంభించారు. కొవిడ్ చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఈ కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. త్వరలోనే జిల్లా కేంద్రలోని వంద పడకల ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.