రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ వి.శ్రీనివాసులు కోరారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా అధిగమించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువులు, కుంటలు పరిశీలించి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని అదనపు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.