ETV Bharat / state

'జిల్లా కేంద్రంలో బంజారా భవన్‌ నిర్మిస్తాం'

author img

By

Published : Feb 19, 2020, 8:12 PM IST

Updated : Feb 19, 2020, 9:49 PM IST

జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 281వ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక మంత్రితో మాట్లాడి జిల్లా కేంద్రంలో బంజారా భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Santhu Sri Sevalal 281 Birthday Celebrations in Janagama district
'బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ నిర్మిస్తాం'

సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి ఉత్సవాలను జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లంబాడి వేషధారణలతో మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, బంజారాహిల్స్​లో బంజారా భవన్ నిర్మిస్తుందని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గురుకులలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి లక్ష ఇరవై వేలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి

Last Updated : Feb 19, 2020, 9:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.