జనగామ జిల్లాలో వలస కూలీలకు బియ్యం, నగదును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి కలెక్టర్ నిఖిల పంపిణీ చేశారు. జిల్లా పరిధిలో వలసదారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. 2,445 మంది కూలీలకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున నగదు పంపిణీ చేశారు.
ప్రజలంతా కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని... స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కెమికల్ స్ప్రే చేయించారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య