జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామంలో నిర్వహించిన హరితహారంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై, మొక్కలు నాటారు. చెత్తను ఎరువుగా మార్చే కంపోస్ట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. మొక్కల సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణతోనే భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కొడిమ్యాలలో గురుకుల పాఠశాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గవర్నర్ ఆమోదం పొందిన కొత్త పురపాలక చట్టం