ETV Bharat / state

Jagtial Medical College: వడివడిగా మెడికల్ కాలేజీల నిర్మాణం - జగిత్యాల వైద్య కళాశాలలు

Jagtial Medical College: గ్రామీణ ప్రాంత ప్రజలకూ మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఎనిమిది మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్‌ కాలేజీల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ.. అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. జగిత్యాల మెడికల్ కాలేజీకి వచ్చే విద్యా సంవత్సరంలో అనుమతులు లభించేలా పనులు చేస్తున్నట్లు తెలిపారు.

Jagtial Medical College
Jagtial Medical College
author img

By

Published : Jan 27, 2022, 11:46 AM IST

Jagtial Medical College: మారుమూల ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొదట 8 మెడికల్ కాలేజీలను నిర్మిస్తోంది. మెరుగైన వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంతవాసులు పట్టణాలకు, నగరాలను పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. అన్ని సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దుతోంది. వీటి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అందులో భాగంగానే.. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాల వైద్యకళాశాల నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి.. 80 శాతం పనులు పూర్తయ్యాయని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు.

మెరుగైన వైద్యం..

Medical College in Jagtial: వైద్యకళాశాలకు అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి అయ్యింది. అనాటమీ, సైకాలజీ, కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు ఇప్పటికే కల్పించారని వైద్యకళాశాల వైద్యశాఖ అధికారులు తెలిపారు. మెడికల్ కాలేజీతో మెరుగైన వైద్యం అందుతుందని స్థానిక నేతలు అంటున్నారు.

అనుమతి రావాలంటే..

Jagtial Medical College Works: మెడికల్ కాలేజీకి అనుమతి రావాలంటే 400పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం జగిత్యాలో 100 పడకల ఆసుపత్రితో పాటు మాతాశిశు కేంద్రంలో కేవలం 130 పడకలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల మాతాశిశు కేంద్రంలో అదనంగా 162 పడకలు నిర్మించబోతున్నట్లు అధికారులు వివరించారు.

వైద్యంలోనూ మనమే నంబర్ వన్!

Minister Vemula Prashanth: పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలందించాలని తెలంగాణ సర్కార్ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతోంది. వైద్యంలోనూ తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలపడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారు. కేంద్రం నిధులు కేటాయించకపోయినా.. సాయం చేయకపోయినా.. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, 8 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నారు. వీటి బాధ్యతను మా శాఖకు అందించారు. మా శాఖ అధికారులు, సిబ్బంది అందరం కలిసి వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేసి వీటిని అందుబాటులోకి తీసుకువస్తాం.

- వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి

మాట నిలబెట్టుకుంటున్నారు..

MLA Sanjay Kumar: 'ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన వాగ్ధానాలన్ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాలకు మెడికల్ కాలేజీ తీసుకొస్తున్నారు. ఆ పనులు వేగం పుంజుకున్నాయి. త్వరలోనే పూర్తి చేస్తారని అనుకుంటున్నాం.'

- డాక్టర్ సంజయ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.