ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఉత్తర ద్వారానికి రంగులు వేయడంతో పాటు భక్తులు వరుసలో నిల్చునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ గోపురాల చుట్టూ విద్యుత్ లైట్లను అమరస్తున్నారు.
గుంటూరుకు చెందిన భక్తుడు స్వామి వారి అలంకరణకు మూడున్నర లక్షల రూపాయల విలువ గల పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 40 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్