ETV Bharat / state

'రోడ్లు వేసే వరకు ఓట్లు అడగొద్దు' - హైదరాబాద్ జిల్లా వార్తలు

నేరేడ్​మెట్​ డివిజన్​లోని యాప్రాల్​లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని స్థానికులు నిరసన చేపట్టారు. రహదారులు బాగు చేసేంతవరకు తమని ఓట్లు అడగొద్దని అన్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

yapral people protest for road with no road no vote slogan
'రోడ్లు వేసే వరకు ఓట్లు అడగొద్దు'
author img

By

Published : Nov 21, 2020, 5:29 PM IST

హైదరాబాద్​లోని నేరేడ్​మెట్ డివిజన్ పరిధిలో స్థానికులు నో రోడ్ - నో ఓటు అనే ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. యాప్రాల్ ప్రాంతంలోని ధారా ఎన్​క్లేవ్, శైలి గార్డెన్, మెగాధరి హైట్స్, జీకే ప్రైడ్, ప్రకృతి విహార్​లో నిత్యం ప్రయాణించే రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో ఓటర్లు ఆందోళన చేపట్టారు. తమ ప్రాంతం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని... ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు తమని ఓట్లు అడగొద్దని... 'నో రోడ్ నో ఓటు' అనే ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు వేసేంతవరకు ఏ పార్టీ అభ్యర్థులు ఓటు కోసం రావొద్దని ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి: మంత్రి కేటీఆర్​తో యాంకర్​ సుమ భేటీ... ఎందుకంటే...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.