సినిమాను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా అనవసరమైన ప్రకటనలతో తన విలువైన కాలాన్ని వృథా చేశారంటూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ థియేటర్ యాజమాన్యంపై సాయితేజ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 8న కేపీహెచ్‌బీ కాలనీలోని మంజీరా మాల్లో సాయంకాలం 4.40కి చాణక్య సినిమా చూసేందుకని సాయితేజ వెళ్లాడు. టికెట్‌పై తెలిపిన సమయం కన్నా పది నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభించింది యాజమాన్యం. అంతవరకు అనవసరమైన వాణిజ్య ప్రకటనలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించారని సాయితేజ పేర్కొన్నారు. అనవసరమైన ప్రకటనలతో తన విలువైన కాలాన్ని వృథా చేయడమే కాకుండా నిబంధనలను థియేటర్ యజమానులు ఉల్లంఘించారని కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
వినియోగదారులకు అవసరంలేని ప్రకటనలు వేస్తూ విలువైన కాలాన్ని వృథా చేయడం ఆపాలని వినియోగదారుల చట్టం చెబుతున్నా ఎక్కడ మార్పు రావడం లేదని బాధితుడు ఆరోపించాడు. తన కేసు ద్వారానైనా సినిమా థియేటర్ల యాజమాన్యంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాడు.
ఇవీ చూడండి: 'దంగల్ చిత్రం.. చైనా అధ్యక్షుడ్నే మెప్పించింది'