హైదరాబాద్ ప్రజల కోసం సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో కొవిడ్ టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కరోనా రోగులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలపై వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సలహాలు, సందేహాలు నివృత్తి చేస్తున్నారు.
ఎస్సీఎస్సీ సభ్యులు డాక్టర్ రాజీవ్ నేతృత్వంలో కొవిడ్ బాధితులకు సూచనలు ఇస్తున్నారు. ఈ కాల్ సెంటర్లో కాంటినెంటర్, సన్‌షైన్, సహ పలు ఆస్పత్రులకు చెందిన సుమారు 22మంది వైద్యులు అందుబాటులో ఉంటూ సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి వైద్యుల సూచనలు తీసుకోవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలెలా..? ఆరోగ్యశాఖ తర్జన భర్జన..!