రద్దీ ప్రాంతాల్లో రసాయన టన్నెళ్లు ఏర్పాటు చేయాలన్న న్యాయవాది రొనాల్డ్ రాజు పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రసాయన టన్నెళ్లు వాడొద్దన్న కేంద్ర ఆరోగ్య శాఖ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి సమర్పించింది.
వ్యక్తులపై సోడియం హైపోక్లోరైట్ చల్లడం మంచిది కాదని కేంద్ర ఆరోగ్య శాఖ నివేదించినట్లు తెలిపింది. రసాయనాలు స్ప్రే చేస్తే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని నివేదికలో ఉన్నట్లు చెప్పింది.
రసాయనాలు చల్లినా శరీరంలోని వైరస్ చావదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. కేంద్ర సిఫార్సుల మేరకు రాష్ట్రంలో టన్నెళ్లు ఉపయోగించలేమని స్పష్టం చేసింది.
ప్రమాద రహిత రసాయనాలున్నాయా అనే అంశంపై ఐపీఎంతో చర్చించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.