ETV Bharat / state

అర్హులైన బలహీన వర్గాలను 2010లోనే గుర్తించాం: ప్రభుత్వం

author img

By

Published : Nov 4, 2020, 9:20 PM IST

ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద అర్హులైన బలహీన వర్గాలను 2010లోనే గుర్తించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించడం లేదన్న కేంద్రం వాదనలో నిజం లేదని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది ఎస్.సంజీవ్ కుమార్ వాదించారు. అర్హులను గుర్తిస్తూ 2010లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 44 జారీ చేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత దాన్ని తెలంగాణ సర్కారు అన్వయించుకుందని తెలిపారు.

అర్హులైన బలహీన వర్గాలను 2010లోనే గుర్తించాం: ప్రభుత్వం
అర్హులైన బలహీన వర్గాలను 2010లోనే గుర్తించాం: ప్రభుత్వం

ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద అర్హులైన బలహీన వర్గాలను 2010లోనే గుర్తించినట్లు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ముందుకు వెళ్లలేక పోతున్నట్లు తెలిపింది. విద్యా హక్కు చట్టం అమలుపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పంపించడం లేదన్న కేంద్రం వాదనలో నిజం లేదని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది ఎస్.సంజీవ్ కుమార్ వాదించారు. అర్హులను గుర్తిస్తూ 2010లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 44 జారీ చేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత దాన్ని తెలంగాణ సర్కారు అన్వయించుకుందని తెలిపారు. అయితే నలంద పాఠశాల దాఖలు చేసిన పిటిషన్​ను గతంలో విచారించిన హైకోర్టు.. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద అర్హులైన సీట్ల వివరాలు కూడా తెలంగాణ ప్రభుత్వం పంపాల్సి ఉందని కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 20కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 'అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరించేందుకే ఎల్​ఆర్​ఎస్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.