మే నెల వేతనాలు, ఫించన్లలో కోత విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఇందుకు వ్యతిరేకంగా జూన్ 1న అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రధాన కూడళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా నిర్ణయించింది.
వరుసగా మూడో నెల కోత విధించడం వల్ల లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ప్రభుత్వ చర్యలను ప్రతిఘటించకపోవటం వల్లనే ఇలా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. నిరసనకు వచ్చేవారు మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని కమిటీ స్పష్టం చేసింది. ధర్నా అనంతరం కలెక్టర్లు లేదా ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుందిలా..