Telangana Congress Screening Committee Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. దేశ రాజధానిలోని వార్‌రూమ్‌లో (T Congress) తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటి సమావేశమైంది. అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపనుంది. కాగా కొన్ని జిల్లాల అభ్యర్థులను తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కొన్ని జిల్లాల్లోని అభ్యర్థులను ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. ఇవాన జరిగే సమావేశంలో ఆయా జిల్లాలపై చర్చించనున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే నాయకులను ఎంచుకునేందుకు ప్రతి అభ్యర్థిపై హస్తం నాయకులు సర్వేలు చేయించి వారిని ఎంపిక చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో అధికార పార్టీ నుంచి చేరికలు వస్తున్న వేళ.. టికెట్ ఎవరికి ఇవ్వాలి అన్న ఆందోళన హస్తం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ టికెట్ విషయంలో అసంతృప్తి చెందిన ముఖ్య నేతలందరు.. హస్తం గూటికి చేరుకుంటున్నారు. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులకు ఛాన్స్ ఇవ్వాలా.. టికెట్ ఆశించి పార్టీలోకి వచ్చిన నేతలకు ఇవ్వాలా అన్నది స్క్రీనింగ్ కమిటీకి సవాల్‌గా మారింది.
T Congress Screening Decision : ఇప్పటి వరకు కసరత్తు చేసిన నియోజకవర్గాలకు చెందికూడా తాజా సర్వేల ఆధారంగా పున:పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ కార్యదర్శులు, కొందరు మాజీ మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలల్లో సింగిల్ నేమ్స్ ఉన్నాయి. వారికి సంబంధించి ఏకాభిప్రాయం ఉండడంతో.. వాటిని పక్కన పెట్టి... ఇద్దరు ముగ్గురు టికెట్ కోసం పోటీలో ఉన్నచోట్ల కూడా సింగిల్ నేమ్ తీసుకొచ్చారు. అయితే తాజా సర్వేల ఆధారంగా సింగిల్ నేమ్ తీసుకొచ్చినవి...అవే ఉన్నాయా... ఏవైనా మారాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సింగిల్ నేమ్ తీసుకొచ్చిన తరువాత... ఇప్పుడు సర్వేలల్లో వేరే పేరు ఉన్నట్లయితే... ఎందుకు ఆలా జరిగిందో లోతైన అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. పొరపాటున కూడా ప్రజాబలం లేని వారికి టికెట్ దక్కుకూడదని ఆలోచనతో స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది.
T-Congress MLA Candidate Selection Process : గత నెల 22న నిర్వహించిన కమిటీ సమావేశంలో దాదాపు 80కుపైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అప్పుడు జరిగిన సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదు. ఇవాళ జరిగే సమావేశంలో(T Congress Candidate Final List) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 శాసనసభ స్థానాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగిలిపోయిన నియోజకవర్గాల పైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో జరిగిన సమావేశంలో ఎల్బీనగర్, సూర్యాపేట, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ స్థానాల విషయంలో కమిటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి.. దీంతో దాదాపు 30 నియోజకవర్గాల్లో అధిష్ఠానం మరోమారు సర్వేలు చేయించింది.. సర్వేల ప్రకారం అభ్యర్థులను వారి బలబలాలు, పార్టీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు, వారు చేస్తున్న కార్యక్రమాలు, ఇతర పార్టీల అభ్యర్థులను వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని వారిని ప్రకటించే అవకాశం ఉంది.
T Congress Leaders in Delhi : ఇప్పటి వరకు స్క్రీనింగ్ కమిటీలో జరిగిన అంశాలు బయటకు రావడంతో...పైరవీలు, లాబీయింగ్‌లు అధికమైనట్లు తెలుస్తోంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ దగ్గర నుంచి సభ్యుల వరకు వారికి ఎవరు దగ్గరగా ఉన్నారో...తెలుసుకుని...వారిని కలిసి తమకు టికెట్ దక్కేట్లు చూడాలని కోరుతున్నారు. ఇవాల ఉదయం మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కమిటీ ఛైర్మన్ మురళీదరన్‌ను కలిసి మహిళా విభాగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ధిల్లీలోనే మకాం వేసి...స్క్రీనింగ్ కమిటీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా ఇవాళ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ధిల్లీలో ఉండడంతో...తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నాయకులంతా ధిల్లీ బాట పట్టారు. కొందరు గడిచిన రెండు, మూడు రోజులుగా ధిల్లీలోనే ఉండగా, ఎక్కువ మంది ఇవాళ ధిల్లీ చేరుకున్నారు.
గత నెల 22న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన అనంతరం బీఆర్ఎస్ టికెట్ విషయంలో అసంతృప్తి చెంజిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన నక్కా ప్రభాకర్‌గౌడ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంశాలూ ఆదివారం నాటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరగనున్నాయి. వామపక్షాలతో పొత్తుపై సందిగ్ధత కొనసాగుతుండడంతో నాలుగైదు సీట్లు మినహా మిగతా స్థానాలపై ఆదివారం నాటి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయవచ్చని పార్టీవర్గాల సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు నిర్వహించాల్సిన బస్సు యాత్రపైనా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఈ నెల 15న బస్సు యాత్రను (Congress Bus Yathra) ప్రారంభించే అవకాశం ఉంది.