కరోనా కట్టడి కోసం నలభై రోజులుగా చేసిన కృషిని మద్యం దుకాణాలను తెరిచి ప్రభుత్వం ఒక్కరోజులో బూడిదలో పోసిన పన్నీరు చేసిందని తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కరోనాపై మాట్లాడిన కేసీఆర్.. ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తూనే నిర్మాణాత్మక సలహాలు ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్న ప్రతిపక్షాలను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దినసరి కూలీలకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున రెండు నెలలపాటు ఇచ్చి ప్రజలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తాలు పేరుతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్