ETV Bharat / state

ఒకే వేదికపై పతంగులు, మిఠాయిలు స్నాక్స్​ ప్రారంభం

హైదరాబాద్ నగరంలో ఏటా కన్నులపండువగా నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జంట నగరాల ప్రజల ఆనందోత్సవాలను ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. రంగురంగుల పతంగులతో పాటు నోరూరించే మిఠాయిలు, డీజే మోతలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఒకే వేదికపై ఏర్పాటవటం వల్ల మూడురోజుల పాటు నగరవాసులకు పండుగ అని చెప్పవచ్చు.

Start with racks and candy snacks on the same platform  at hyderabad
ఒకే వేదికపై పతంగులు, మిఠాయిలు స్నాక్స్​ ప్రారంభం
author img

By

Published : Jan 14, 2020, 5:03 AM IST

సంక్రాంతి వచ్చిందంటే.. కోడిపందేలు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు.. ఇవన్నీ సొంతూల్లో ఆత్మీయుల మధ్య జరుపుకోటానికి ఊళ్లకు నగరవాసులు పయనమవుతుంటారు. ఈ ప్రయాణలతో సగం నగరం ఖాళీ అవుతుంది. నగరంలో పండుగ జరుపుకునేవారికి శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు, పరేడ్ గ్రౌండ్​లో కైట్, స్వీట్, స్నాక్​​ ఫెస్టివల్స్​ సిధ్ధంగా ఉన్నాయి. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్​లో ఈ పతంగుల పండుగ నిర్వహిస్తోంది. మూడేళ్ళుగా మిఠాయిల ఉత్సవాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకవైపు కైట్స్, మరోవైపు స్వీట్స్​, అప్పుడప్పుడు స్నాక్స్​తో పట్నం వాసుల పండుగ వేడుకలు జోరందుకున్నాయి.

15 దేశాల నుంచి..
ఈసారి 5వ అంతర్జాతీయ పతంగుల పండుగకు.. సింగపూర్, తైవాన్, ఉక్రెయిన్, థాయ్​లాండ్, జర్మనీ వంటి 15 దేశాల నుంచి 37 మంది విదేశీ కైటర్స్, తెలుగు రాష్ట్రాలు, గుజరాత్​తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 60 మంది ఈ కైటర్స్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. భారీ సైజులో, భిన్న ఆకారాల్లో, ఎల్​ఈడీ లైట్లతో ఎగిరే రంగురంగుల పతంగులను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. కైట్ పోటీలతో పాటు.. తెలంగాణ సాంప్రదాయ ఆటలను జింఖానా గ్రౌండ్​లో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇక్కడ కొలువుదీరిన 25 రాష్ట్రాల గృహిణులు తయారుచేసిన వెయ్యికి పైగా మిఠాయిలు, 300 స్నాక్స్ సందర్శకులకు నోరూరిస్తున్నాయి.

సుమారు పది లక్షల సందర్శకులు
మొదటిరోజు గాలి సహకరించకపోవటం వల్ల తక్కువ సంఖ్యలో పతంగులు ఎగిరాయి. పతంగుల పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలి వచ్చారు. ఈ మూడు రోజుల్లో సుమారు పది లక్షల సందర్శకులు పాల్గొంటారని పర్యటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆశాభావం వ్యక్తం చేశారు.

అహ్మదాబాద్​కు దీటుగా
విభిన్న సంస్కృతులు గల భాగ్యనగరానికి ఇలాంటి ఉత్సవాలు మరింత శోభను, ఖ్యాతిని అందిస్తాయని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్​లోని అహ్మదాబాద్​కు దీటుగా వేడుకలు నిర్వహించి దిన దినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మూడురోజుల పాటు నగరంలో జరిగే ఈ కైట్, స్వీట్ ఫెస్టివల్​ను కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆస్వాదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు నిచ్చారు.

ఒకే వేదికపై పతంగులు, మిఠాయిలు స్నాక్స్​ ప్రారంభం

ఇదీ చూడండి : 'ఇంటికి వెళుతున్నారా? ఠాణాలో సమాచారం ఇవ్వండి'

TG_HYD_01_14_HYD_KITE_FESTIVAL_PKG_3181965 REPORTER : PRAVEEN KUMAR CAMERA : SRIDHAR ( ) హైదరాబాద్ నగరంలో ఏటా కన్నులపండువగా నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమైంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జంట నగరాల ప్రజల ఆనందోత్సవాలను ద్విగుణీకృతం చేసేలా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ఏర్పాట్లు చేసింది. రంగురంగుల పతంగులతో పాటు నోరూరించే మిఠాయిలు, డీజే మోతలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఒక్క వేదికపై ఏర్పాటవటం.. మూడురోజుల పాటు నగరవాసులకు పండుగే మరి.. look V. O : సంక్రాంతి వచ్చిందంటే.. కోడిపందేలు, పిండి వంటలు, ముగ్గుల పోటీలు.. ఇవన్నీ సొంతూల్లో ఆత్మీయుల మధ్య సెలెబ్రేట్ చేసుకోవటానికి పల్లెటూళ్లకు నగరవాసులు పయనమవుతుంటారు. దాంతో సగం నగరం ఖాళీ. మరి నగరంలో సంక్రాంతి జరుపుకోవలనుకునే వారికి శిల్పారామం లో సంక్రాంతి సంబరాలు, పరేడ్ గ్రౌండ్ లో కైట్ స్వీట్ ఫెస్టివల్ లు ఉన్నాయండోయ్. 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో పతంగుల పండుగ నిర్వహిస్తోంది. మూడేళ్ళుగా మిఠాయిలు ఉత్సవాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఒకవైపు కైట్స్, మరోవైపు స్వీట్స్ తో పట్నం వాసుల పండుగ సెలెబ్రేషన్స్ జోరందుకున్నాయి. Spot V. O : ఈసారి 5వ అంతర్జాతీయ పతంగుల పండుగకు.. సింగపూర్, తైవాన్, ఉక్రెయిన్, థాయ్ ల్యాండ్, జర్మనీ ఇలా 15 దేశాల నుంచి 37 మంది విదేశి కైటర్స్, రెండు తెలుగు రాష్ట్రాలు, గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 60 మంది ఈ కైటర్స్ ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. భారీ సైజ్ లో, భిన్న ఆకారాల్లో, led లైట్లతో ఎగిరే రంగురంగుల పతంగులను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. కైట్ పోటీలతో పాటు.. తెలంగాణ సాంప్రదాయ ఆటలను జింఖానా గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. పతంగులతో పాటు.. ఇక్కడ కొలువుదీరిన 25 రాష్ట్రాల గృహిణులు తయారుచేసిన వెయ్యికి పైగా మిఠాయిలు, 300 స్నాక్స్ రకాలు సందర్శకులకు నోరూరిస్తున్నాయి. Spot+ voxpop V.O : మొదటిరోజు గాలి సహకరించకపోవటంతో తక్కువ సంఖ్యలో పతంగులు ఎగిరాయి. పతంగుల పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలి వచ్చారని.. ఈ మూడు రోజుల్లో పది లక్షల సందర్శకులు ఫెస్టివల్ లో పాల్గొంటారని పర్యాటకశాఖా కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆశాభావం వ్యక్తం చేశారు. బైట్ బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కార్యదర్శి V. O : హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని.. కాస్మోపాలిటన్ సంస్కృతి గల భాగ్యనగరానికి ఇలాంటి ఉత్సవాలు మరింత శోభను, ఖ్యాతిని అందిస్తామని ముఖ్యఅతిధిగా హాజరైన మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు ధీటుగా వేడుకలు నిర్వహించి దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మూడురోజుల పాటు నగరంలో జరిగే ఈ కైట్, స్వీట్ ఫెస్టివల్ ను కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో వచ్చి ఆస్వాదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. Bytes కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి End with ptc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.