ETV Bharat / offbeat

క్రిస్పీ అండ్​ టేస్టీ "తోటకూర గారెలు" - ఇలా చేశారంటే టేస్ట్ అదుర్స్!

-తోటకూరతో వేపుడు, పప్పు మాత్రమే కాదు ఇవీ చేయండి - ఈవెనింగ్​ స్నాక్స్​, చాయ్ కాంబో సూపర్​!

How to Make Thotakura Gatti Garelu
How to Make Thotakura Gatti Garelu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How to Make Thotakura Gatti Garelu: తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే తోటకూరతో వంటలు అనగానే తోటకూర పప్పు, తోటకూర వేపుడు మాత్రమే గుర్తుకు వస్తుంటాయి. అయితే.. వీటితో గారెలు కూడా చేసుకోవచ్చు. వీటినే తోటకూర గట్టి గారెలు అంటారు. దక్షిణాదిలోని చాలా ప్రాంతాల్లో ఈ గారెలు చాలా మందికి సుపరిచితమే. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..

తోటకూర గట్టి గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు:

  • శనగపప్పు - ఒక కప్పు
  • మినప్పప్పు - అర కప్పు
  • తోటకూర తరుగు - 1 కప్పు
  • ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
  • వెల్లుల్లి ముద్ద - 2 టేబుల్​ స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్​ స్పూన్​
  • అల్లం తరుగు - ఓ టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సోంపు లేదా జీలకర్ర - 1 టీ స్పూన్​
  • నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​లోకి శనగపప్పు, మినప్పప్పు వేసి నీళ్లతో శుభ్రంగా కడిగి ఓ నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
  • అవి బాగా నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా జల్లెడలో వేసుకోవాలి.
  • ఆ తర్వాత వాటిని మిక్సీజార్​లోకి వేసి అవసరమైన మేరకు నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ పోసి రుబ్బుకుంటే గారెలు అంత రుచికరంగా ఉండవు. ఎందుకంటే పిండి జోరు అయితే గారెలు విరిగిపోతాయి. కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. అలా గ్రైండ్​ చేసుకన్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఈలోపు తోటకూరను కాడలు లేకుండా సన్నగా తరిగి శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసి ఆ తరుగును పప్పు ముద్దలో వేసి కలుపుకోవాలి.
  • అనంతరం అందులోకి ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు, సోంపు లేదా జీలకర్ర వేసి తోటకూరను గట్టిగా పిండుతూ కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి.
  • అది వేడెక్కే లోపు ఓ అరటి ఆకు లేదా ఏదైనా కవర్​ మీద కొద్దిగా నూనె రాసి పిండి ముద్దను కొద్దిగా తీసుకుని దాని మీద పెట్టి గారెలుగా ఒత్తి మధ్యలో కొద్దిగా రంధ్రం పెట్టాలి.
  • నూనె కాగిన తర్వాత లో ఫ్లేమ్​లో పెట్టి చేసుకున్న గారెలను అందులో వేసుకోవాలి. కడాయి సైజ్​ను బట్టి గారెలు వేసుకోవాలి.
  • ఓ నిమిషంపాటు అలానే ఉంచి ఇప్పుడు స్టవ్​ను మీడియంలో పెట్టి రెండు వైపులా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గారెలుగా చేసుకోవాలి.
  • అంతే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే తోటకూర గట్టి గారెలు రెడీ. వీటిని వేడివేడిగా ఓ కప్పు చాయ్​తో కలిపి తీసుకుంటే కాంబినేషన్​ అదుర్స్​.

అటుకులతో అద్దిరిపోయే నగ్గెట్స్ - పిల్లలు వదలకుండా కుమ్మేస్తారు!

వావ్ అనిపించే రెస్టారెంట్ స్టైల్ "చిల్లీ గార్లిక్ చికెన్" - ఈజీగా చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.