కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటునందించేందుకు సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విరాళాలకు సంబంధించిన చెక్కులను వివిధ పరిశ్రమలు, బిల్డర్ల సంఘాల ప్రతినిధులు ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్కు అందించారు. నాట్కో ఫార్మా రూ.2 కోట్ల 50 లక్షల విలువైన పర్సనల్ పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్)లతో పాటుగా రూ.1.50 కోట్ల విలువైన మెడిసిన్స్, ఇతర పరికరాలను అందించింది.
మలబార్ గ్రూప్ కోటి రూపాయలను సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్... కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవసరం ఉన్న వారికి నిత్యావసరాలను అందిస్తోంది. నవయుగ కంపెనీ కోటి రూపాయలను విరాళంగా అందించింది. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ రూ.46 లక్షలను సీఎంఆర్ఎఫ్నకు అందించింది.
విజ్ఞాన్ జ్యోతి సొసైటీ రూ. 40 లక్షలు, గోకరాజు రంగరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ రూ. 25 లక్షలను విరాళంగా అందజేశాయి. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్, పెన్నా సిమెంట్స్, వెర్టెక్స్ హోమ్ లిమిటెడ్, వాసమి క్లబ్, శ్రీరాం ఎంటర్ప్రైజెస్, సుచిత్రా అకాడమీ, చిత్రా లేఅవుట్ వెల్పేర్ అసోషియేషన్ కూడా సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందజేశాయి.





