హైదరాబాద్ సరూర్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. స్థానిక కోదండరాం నగర్, సీ సిలస్, హనుమాన్ నగర్ టెంపుల్, పద్మావతి కాలనీ ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లుతుండగా పలు కాలనీలు నీట మునిగాయి.
వర్షాల కారణంగా రాత్రి నుంచి ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లగా స్థానికులు ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్నారు. తమకు తినడానికి భోజనం లేదని.. ఉద్యోగాలకు కూడా వెళ్లలేదని.. ఈ విషయమై స్థానిక కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ రెండు రాష్ట్రాలకు బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్