ETV Bharat / state

Race Energy Swap Station: ఎలక్ట్రిక్‌ వాహనాదారులకు శుభవార్త.. కేవలం రెండు నిమిషాల్లో బ్యాటరీ స్వాపింగ్‌ - గచ్చిబౌలిలో రేస్ ఎనర్జీ స్టేషన్

Race Energy Swap Station: రాజధాని నగరంలో ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. వాహనాల ఛార్జింగ్ సమస్యలు తీర్చేందుకు రేస్‌ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది. గచ్చిబౌలిలోని మైండ్‌స్పేస్‌ కూడలిలో తన మొదటి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది.

Race Energy Swap Station
కంపెనీ సహ వ్యవస్థాపకుడు గౌతం మహేశ్వరన్
author img

By

Published : Jan 3, 2022, 7:38 PM IST

Race Energy Swap Station: భాగ్యనగరంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల ఛార్జింగ్ కష్టాలు తీరనున్నాయి. వాహనదారుల సమస్యను తీర్చేందుకు రేస్‌ ఎనర్జీ అనే సంస్థ ముందుకొచ్చింది. గచ్చిబౌలిలోని మైండ్‌స్పేస్‌ కూడలిలో హెచ్‌పీసీఎల్ భాగస్వామ్యంతో మొదటి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈనెలలోనే నగరంలోని మూడు ప్రధాన స్టేషన్లలో మూడు స్వాపింగ్ స్టేషన్లను ప్రారంభిస్తామని రేస్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది.

electric vehicles charging stations: 2023 కల్లా హైదరాబాద్ వ్యాప్తంగా 100, దేశంలోని ప్రధాన నగరాల్లో 500 స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు గౌతం మహేశ్వరన్ ప్రకటించారు. ప్రస్తుతం ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 48 వోల్టుల బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని కల్పిస్తోన్న రేస్ ఎనర్జీ.. త్వరలో ఈ సామర్ధ్యాన్ని మరింత పెంచనున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాల మాదిరే.. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీలను రేస్ ఎనర్జీ స్టేషన్ల ద్వారా కేవలం రెండు నిమిషాల్లోనే బ్యాటరీ స్వాప్ చేసుకునే వీలుందని గౌతం మహేశ్వరన్‌ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.