ETV Bharat / state

Kodandaram fire on govt: 'పరిపాలన అస్తవ్యస్తం.. అందుకే ఉద్యోగుల కేటాయింపుల్లో గందరగోళం'

Kodandaram fire on govt: ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఉద్యోగుల కేటాయింపుల్లో గందరగోళం తలెత్తిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. జిల్లాల కూర్పులో జరిగిన తప్పులే ఈ అనర్థానికి కారణమని చెప్పారు. ప్రభుత్వం సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి లోపాలను సరిచేసిన తరువాత నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు.

Kodandaram fire on govt
Kodandaram fire on govt
author img

By

Published : Dec 25, 2021, 10:47 AM IST

Updated : Dec 25, 2021, 12:52 PM IST

Kodandaram fire on govt: ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఉద్యోగుల కేటాయింపుల్లో గందరగోళం తలెత్తిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. 2018 ఆగస్టు 30న వచ్చిన 124 జీవో ప్రకారం మూడేళ్లలోపు ఉద్యోగుల కేటాయింపు పూర్తి కావాలని తెలిపారు. కానీ ప్రభుత్వం మూడేళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు బాధ్యతను విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వర్గీకరణ... సరైన ఆలోచన లేకుండా చేసిందని తెలిపారు. కొత్త జిల్లాల్లో అన్ని శాఖలను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. జిల్లాల కూర్పులో జరిగిన గందరగోళం ఈ అనర్థానికి దారి తీసిందని చెప్పారు. ప్రభుత్వం సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి లోపాలను సరిచేసిన తరువాత నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే...

ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆవేదనకు ప్రభుత్వ అలసత్వమే కారణమని కోదండరాం దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉపాధ్యాయుల జాబితాను పారదర్శకంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. స్థానికతను బట్టి కేటాయింపులు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. అందుకే ఉద్యోగుల కేటాయింపుల్లో గందరగోళం తలెత్తింది. వాస్తవానికి 2018 ఆగస్టు 30న వచ్చిన 124 జీవో ప్రకారం మూడేళ్లలోపు ఉద్యోగుల కేటాయింపు పూర్తి కావాలి. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు బాధ్యతను విస్మరించింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫైల్​ను ప్రభుత్వం అటకెక్కించింది. కొలువుల భర్తీపై ఒత్తిడి పెరగటంతో హడావిడిగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాని ప్రభుత్వం చూస్తుంది. దీంతో గందరగోళం తలెత్తింది. వాస్తవానికి సీనియార్టీ జాబితాను సిద్ధం చేసి లోపాలను సరిచేసిన తరువాత నిర్ణయం తీసుకుంటే బాగుండేది.- ఆచార్య కోదండరాం, తెజస అధ్యక్షుడు

ప్రభుత్వ తీరుతో ఉద్యోగుల కేటాయింపుల్లో గందరగోళం...

ఇదీ చదవండి: Harish Rao on Telangana Police :'రాత్రి పగలు లేకుండా కష్టపడుతున్న ఏకైక శాఖ పోలీసు శాఖ'

Last Updated : Dec 25, 2021, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.