ETV Bharat / state

అపస్మారక స్థితిలో ఉన్న వృద్దురాలిని చేరదీసిన పోలీసులు - వృద్దురాలిని చేరదీసిన పోలీసలు

అపస్మారక స్థితిలో ఉన్న ఓ వృద్దురాలిని చేరదీసి సికింద్రాబాద్ పోలీసుల తమ మానవత్వాన్ని చాటుకున్నారు. తమ చేతులతో ఆమెకు ఆహారాన్ని తినిపించి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయం తెలుకున్న ఉన్నతాధికారులు సాయం చేసిన సిబ్బందిని అభినందించారు.

The police help the old woman
వృద్దురాలిని చేరదీసిన పోలీసలు
author img

By

Published : May 21, 2021, 5:10 PM IST

లాక్​డౌన్​ వేళ సికింద్రాబాద్​లోని బోయిన్​పల్లి పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వృద్దురాలిని చేరదీసిన విజయకుమార్ ,నజీర్ పాషా అనే కానిస్టేబుళ్లు తమ చేతులతో ఆహారాన్ని తినిపించారు. ఆనంతరం ఆమెకు దుస్తులు అందించారు. వృద్దురాలు మామూలు స్థితికి చేరుకున్నాక వివరాలు అడిగి బోయిన్​పల్లిలో ఉంటోన్న ఆమె తమ్ముడి వద్దకు చేర్చారు.

నగరంలోని బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న విజయకుమార్, నజీర్ పాషాలకు ఓ వృద్దురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె పరిస్థితిని గుర్తించి ఆహారాన్ని, బట్టలను అందించారు. వివరాలు తెలుసుకుని బోయిన్​పల్లిలో ఉంటోన్న ఆమె తమ్ముడి వద్దకు చేర్చారు. సకాలంలో స్పందించి వృద్దురాలిని ఆదుకోవడంతో పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ఇదీ చదవండి: పర్యావరణ ఉద్యమకారుడు బహుగుణ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.