ETV Bharat / state

Petrol Price Hike Effect: నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు... కూరగాయలు, నిత్యావసరాలపైనా ప్రభావం - తెలంగాణలో పెట్రో ధరలు

వాహనదారులు, డ్రైవర్లకే కాదు.. వినియోగదారులకూ ధరల మంట తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో వచ్చే నిత్యావసరాలు, ఇతర సరకుల ధరలు మండిపోతున్నాయి. టమాటాలను హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.50కి అమ్ముతున్నారు. ఇవి నిత్యం ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వస్తుంటాయి.

petrol-and-diesel-costs
నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు
author img

By

Published : Oct 25, 2021, 8:15 AM IST

నింగినంటుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. డీజిల్‌ రేటు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్పు చేసి ఆటోలు, కార్లు, వ్యాన్లు కొని నడిపే యజమానులు, డ్రైవర్లు అల్లాడుతున్నారు. తాజాగా ఆదివారం పెట్రోల్‌ ధర లీటరుపై మరో 36 పైసలు పెరిగి రూ.111.91కు, డీజిల్‌పై 38 పైసలు పెరిగి రూ.106కు చేరింది. గత ఏడాది కాలంలో లీటరుపై సుమారు రూ.34 పెరగడంతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. నిత్యావసరాల ధరలపైనా ప్రభావం చూపుతోంది. దేశంలో పంటలు ఇబ్బడిముబ్బడిగా పండినా వాటి ధరలు ఆకాశాన్నంటడానికి ప్రధానంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలే కారణమని పలువురు టోకు వ్యాపారులు తెలిపారు. పలు రంగాలపై డీజిల్‌, పెట్రోల్‌ ధరలు ప్రభావం చూపుతుండటంతో ప్రజలపై అనేక రకాలుగా ఆర్థిక భారం పడుతోంది. నిత్యావసరాలు మొదలుకుని స్కూల్‌ బస్సు రుసుముల దాకా అన్నీ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల వారి జేబుకు చిల్లు పడుతోంది. ఇంధనం ధరలు ప్రతిరోజూ పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలూ అదేస్థాయిలో అధికమవుతున్నాయి. లారీలు, వ్యాన్లు, ఆటోల కిరాయిల రూపంలో వచ్చిన సొమ్ము డ్రైవర్‌, క్లీనర్‌ల జీతాలకే సరిపోతోందని.. వాహనం నిర్వహణకు, నెలవారీ కిస్తీలు చెల్లించేందుకూ మిగలడం లేదని యజమానులు పేర్కొంటున్నారు. ఆటోవాలాలదీ అదే పరిస్థితి. పాత ఛార్జీలతోనే నడుపుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని వారు వాపోతున్నారు.

  • వ్యవసాయంలో అనేక పనులకు వాహనాలు, యంత్రాలు వాడుతున్నందున రైతులపై ఆర్థిక భారం పడుతోంది. డీజిల్‌ ధరలు పెరుగుతున్నంత వేగంగా తాము అమ్ముతున్న పంటల ధరలు ఎందుకు పెరగడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కూరగాయలు, పండ్లకూ ధరల మంట

మహారాష్ట్రలోని సోలాపూర్‌, నాసిక్‌, కొల్హాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం లారీల్లో కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యాసరాలు వస్తుంటాయి. డీజిల్‌ ధర పెరుగుదలతో లారీ కిరాయిలు పెరుగుతున్నాయి. గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. కొన్నిచోట్ల ఇప్పుడు రూ.30 వేల దాకా పెంచారు. దీంతో కూరగాయలు, పండ్ల ధరలూ మండిపోతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలో ఉల్లిగడ్డలు, దానిమ్మ పండ్లు రెట్టింపు ధరలు పలుకుతున్నాయి.

- ఎల్లప్ప, లారీ డ్రైవర్‌, సోలాపూర్‌, మహారాష్ట్ర

వరికోత పనులు భారమయ్యాయి

గతేడాదితో పోలిస్తే వరి కోత, నూర్పిడి యంత్రాల కిరాయిని ఎకరానికి రూ.500 దాకా పెంచేశారు. గతేడాది గంటకు రూ.2,200-2,700 తీసుకునేవారు. ఇప్పుడు రూ.2,700-3,200 అడుగుతున్నారు. పొలాల దుక్కులు, ఇతర యంత్రాలతో చేసే పనులకూ కిరాయిలు పెంచేశారు. కూలీలను పొలాల వద్దకు తీసుకెళ్లడానికి గతంలో 2-3 కిలోమీటర్ల దూరానికి ఆటోలకు రూ.100-200 తీసుకునేవారు. ఇప్పుడు రూ.300-400 అడుగుతున్నారు.

- రాజయ్య, రైతు, ములుగు జిల్లా

రోజుకు రూ.300 కూడా మిగలట్లేదు

-శంకర్‌, ఆటో డ్రైవర్‌, ఎల్బీనగర్‌, హైదరాబాద్‌

డీజిల్‌ ధరల పెరుగుదలతో పూట గడవటం కష్టంగా ఉంది. బ్యాంకు రుణం తీసుకుని స్టీరింగ్‌ ఆటో కొని నడుపుతున్నా. దాని కిస్తీలు కట్టడానికి, ఏదైనా మరమ్మతు చేయించడానికీ చేతిలో డబ్బు ఉండటం లేదు. ఛార్జీలు పెంచితే జనం ఆటో ఎక్కడానికి ముందుకు రావడం లేదు. రూ.100 డీజిల్‌ పోయిస్తే రెండు ట్రిప్పులకైనా రావడం లేదు. గతంలో రోజుకు రూ.500-1000 వచ్చేవి. ఇప్పుడు రూ.200-300 కూడా మిగలడం లేదు. మరో పని తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోనే నడపాల్సి వస్తోంది. డీజిల్‌ ధర పెరుగుదల కారణంగా హైదరాబాద్‌ శివార్లలో ఇప్పటికే 30 శాతం ఆటోలు నిలిచిపోయాయి.

మాంసం ధర పెంచక తప్పలేదు

రాజు, వ్యాపారి, మన్సురాబాద్‌, హైదరాబాద్‌

హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌, విశాఖపట్నం వంటి పెద్ద నగరాలకు కోళ్లు, మేకలు, గొర్రెలు ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో వస్తాయి. డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో మాంసం ధరలూ పెరుగుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నుంచి మేకలు, గొర్రెలు కొని తెస్తుంటాను. కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు తీసుకురావడానికి రవాణా ఆటోకు గతేడాది రూ.600-700 కిరాయి తీసుకునేవారు. ఇప్పుడు రూ.1400-1500 వసూలు చేస్తున్నారు. ఏడాదిలోనే రెండింతలు కావడంతో మాంసం ధర కిలోకు రూ.600 నుంచి రూ.800లకు పెంచాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: Prathidwani: సెంచరీ దాటి పెట్రో ధరలు పయనం ఏ దిశగా?

Fuel Price Today: ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన చమురు ధరలు

Fuel Price Today: పెట్రో మోత- మళ్లీ పెరిగిన చమురు ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.