ETV Bharat / state

జీహెచ్​ఎంసీ పరిధిలో సరిబేసి విధానంలో షాపులకు అనుమతి - ghmc latest news

లాక్ డౌన్ నిబంధనలు మరింత సడలించినందున 2 నెలల తర్వాత జంటనగరాల ప్రజలు మంగళవారం భారీగా రోడ్లపైకి వచ్చారు. కార్యాలయాలు, దుకాణాలు తెరుచుకోవడం వల్ల ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ప్రధాన రహదారులు.. కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించింది. గ్రేటర్​లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున దుకాణాలను సరి, బేసి సంఖ్యల్లో తెరిపించేందుకు అధికారులు ప్రణాళికలు చేశారు. మరోవైపు కరోనా కేసుల తీవ్రత రాజధానిలో కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో సరి, భేసి విధానంలో షాపులకు అనుమతి

author img

By

Published : May 19, 2020, 11:51 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో కరోనా వైరస్ తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,634 కేసులు నమోదైతే.. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. రెండు వారాల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చినా... జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇవ్వలేదు. అయినా... కరోనా కేసులు వందల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని 1427 కుటుంబాలు కంటైన్‌మెంట్‌లో ఉండగా.. ఇందులో 90 శాతం నగరంలోనే ఉన్నాయి.

5 ప్రాంతాల్లో 330 కేసులు

ప్రధానంగా ఎల్బీనగర్, మలక్ పేట్, కార్వాన్, చార్మినార్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ సుమారు 100 వరకు కంటైన్​మెంట్​ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఈ ఐదు ప్రాంతాల్లోనే వారం రోజుల్లో 330 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయడం, బ్లీచింగ్ చల్లుతున్నారు. ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఓల్డ్ మలక్ పేట వాహేద్ నగర్​లోని కంటైన్​మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ పరిశీలించారు. కంటైన్​మెంట్ ఏరియాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మంగళవారం నుంచి గ్రేటర్​లో కూడా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడం వల్ల కరోనా ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

సరి, బేసి విధానంలో ప్రారంభం

లాక్‌డౌన్‌ సడలింపులతో కంటైన్‌మెంట్‌ ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దుకాణాలు సరి, బేసి సంఖ్యలో తెరుచుకోవ్చని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఉదయం నుంచి సర్కిళ్ల వారీగా జీహెచ్ఎంసీ సిబ్బంది దుకాణాలకు నంబర్లు వేశారు. ఒకటో నంబర్ దుకాణం వారు సోమ, బుధ, శుక్ర, 2వ నంబర్ దుకాణం వారు మంగళ, గురు, శనివారాలు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నగరంలో మంగళవారం దుకాణాలు తెరుచుకున్నాయి.

87 మందికి జరిమానా..

కొన్ని ఏరియాల్లో జీహెచ్ఎంసీ అధికారులు నంబర్లు వేయడం పూర్తికాకపోవడం వల్ల దుకాణదారులు కొంత ఇబ్బంది పడ్డారు. దుకాణాల నిర్వహ‌ణ‌ను ఎప్పటిక‌ప్పుడు త‌నిఖీ చేయాల‌ని కమిషనర్ లోకేశ్​ కుమార్ సూచించారు. ప‌క్కపక్కన ఉన్న షాపుల మ‌ధ్య ఏదైన స‌మ‌స్య ఏర్పడితే లాక్‌డౌన్ పూర్తి అయ్యేంత వ‌ర‌కు మూసివేయాల‌ని స్పష్టం చేశారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను విక్రయించే షాపుల‌తో పాటు మెడిక‌ల్‌, నిత్యావ‌స‌ర స‌రకులు, పాల ఉత్పత్తులు, కూర‌గాయ‌లు, పండ్ల విక్రయాల షాపులు, నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణాలు య‌థావిధిగా న‌డుస్తాయి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జీహెచ్ఎంసీ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటి వరుకు కూకట్‌పల్లి సర్కిల్​లో మాస్కులేని 87 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.

ఇవీ చూడండి; సమగ్ర వ్యవసాయ విధానంపై మంత్రి సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.