Lack of Seats in the Trains: సంక్రాంతి పండగ నేపథ్యంలో ఏపీకి వెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రైళ్లలో జనరల్ బోగీలు తగ్గించేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో చాలా మందికి రిజర్వేషన్ దొరకడం లేదు. సాధారణ బోగీలూ సరిపడా లేవు. గతంలో రైలు ముందు, వెనుక 2 చొప్పున బోగీలు ఉండేవి. నేడు వాటి సంఖ్య చాలా రైళ్లలో తగ్గించేశారు.
దీంతో ప్రయాణికులు చేసేది లేక మహిళలు, దివ్యాంగుల కోసం కేటాయించిన బోగీల్లో సైతం ఎక్కి కూర్చోవడమే కాకుండా వారితోనే గొడవ పడుతున్నారు. కొందరు రైలు గార్డు క్యాబిన్‌లోకి ఎక్కేస్తున్నారు. సెలవులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే ఇలా ఉంటే ఇక తర్వాత ఎలా ఉంటుందో అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: