ETV Bharat / state

'కోడెల మృతిపై సోషల్​ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం'

కోడెల మృతి పట్ల అనుమానం ఉన్న ప్రతిఒక్కరినీ విచారిస్తామని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరలోనే పురోగతి సాధిస్తామన్నారు.

బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు
author img

By

Published : Sep 18, 2019, 5:15 PM IST

ఏపీ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు. ఆయన మృతికి గల కారణాలపై అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని విచారించినట్లు వివరించారు. కోడెల కుటుంబ సభ్యుల స్టేట్​మెంట్లను రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. కోడెల ఫోన్​లోని కాల్​డేటాపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో కాల్​డేటాపై వస్తున్న వార్తలు అవాస్తవమని వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరలోనే పురోగతి సాధిస్తామంటున్న బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్​రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్​రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి

ఇవీ చూడండి: కోడెల అంతిమ యాత్ర - ప్రత్యక్షప్రసారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.