ETV Bharat / state

'కాలానుగుణంగా ప్రభుత్వం చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలి' - తెజస అధ్యక్షుడు కోదండరాం

చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేనేత వస్త్రాలు కార్మికులు శ్రమకు గుర్తు అని అన్నారు.

కోదండరాం
author img

By

Published : Aug 7, 2019, 8:12 PM IST

మారుతున్న కాలానికి అనుగుణంగా చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​ ప్రెస్​క్లబ్​లో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వదేశీ ఉద్యమం చేనేత పరిశ్రమ నుంచే ప్రారంభమైందని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలు కార్మికుల శ్రమకు గుర్తు అని... చేనేత అనేది సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య, మాజీ ఎంపీ వివేక్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలకు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు.

'కాలానుగుణంగా ప్రభుత్వం చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలి'

ఇదీ చూడండి : 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.